Description
Oka Vesavi Roju ఒక వేసవి రోజు
ఒక వేసవి రోజు
నిజానికి గౌతంకి వాళ్ళ అమ్మా, నాన్నలంటే చాలా ఇష్టం. కానీ ఇటీవల అతడు చాలా గందరగోళానికి గురికాసాగాడు. వాళ్ళ మాటలు, చేతలు ఏవీ అతడికి నచ్చటం లేదు. ఇంతకు ముందెప్పుడూ ఇలా జరగలేదు.అతి శెలవల్లో ఒక వేసవి రోజు తండ్రితో కలిసి చేసిన ప్రయాణం ఒక ప్రత్యేక అనుభవంగా మారింది. దాంతో అంతా మారిపోయింది. ఆ ఘటనతో గౌతం ఇంకా చిన్న పిల్లవాడు కాదనీ, అన్నీ అర్థం చేసుకుని బాధ్యతయుతంగా ప్రవర్తించే యువకుడిగా ఎదిగాడనీ అతడి అమ్మా,నాన్నలకు అర్థమయ్యింది.
క్రియాకలాపం
‘క్రియని కలుసుకున్నప్పుడు…’ వ్యాసం రాయటానికి ఇది ఒక అంశం ఎలా అవుతుంది? అందుకే టీచరు ఆ అంశం ఇవ్వటంతో చిన్మయి చాలా చిరాకు పడుతోంది. అయితే వ్యాసం మొదలుపెట్టిన తరువాత ఒక క్రియతో ఎదురైన అనేక తమాషా, బాధాకరమైన, మనసును తాకే అనుభవాలు ఆమెకు గుర్తుకు రాసాగాయి. ఆ జ్ఞాపకాలను ఆమె ఎప్పుడూ తన మనసులో పదిలంగా భద్రపరుచుకుంటుంది.
Oka Vesavi Roju ఒక వేసవి రోజు :