Description
అజంతా అపార్ట్‌మెంట్స్ సిరీస్ లోని కథలు 3-8 సంవత్సరాల పిల్లలకి ఉద్దేశించినవి. ఈ కథలన్నీ చదివి వినిపిస్తే చిన్న పిల్లలు ఆనందిస్తారు. పెద్ద పిల్లలు ఈ కథలు తమంతట తామే చదువుకోగలరు. ఈ సిరీస్‌లోని పుస్తకాలన్నింటినీ చదివేస్తే ఏ ఫ్లాట్‌లో ఎవరు నివసిస్తున్నారో మీకు తెలిసిపోతుంది. అంతే కాదు వాళ్లంతా మీకు ఎప్పటి నుంచో మిత్రులని అనిపిస్తుంది.
1- మంచి మిత్రులు
2- అల్లరి జ్యోతి
3- పాత కుందేలు
4- జ్యోతి, పక్కింటి మనిషి
5- హస్మినా గాలిపటం
6- పుట్టిన రోజు బొమ్మ
7- గణేష్, సయీఫ్ వేటకు వెళ్లారు
8- మదన్, సయూఫ్
పాత కుందేలు
అమిత్ కుందేలు బొమ్మ బాగా పాతదైపోయింది, మురికిగా ఉండేది.
అయినా అదంటేనే అతడికి ఇష్టం. ఎక్కడికి వెళ్లినా తన వెంట దానిని తీసుకుని వెళ్లేవాడు. బాధగా ఉన్నప్పుడు, భయం వేసినప్పుడు అది అతడికి అండని ఇచ్చేది.
ఒక రోజు అతడు ఆ బొమ్మను పోగొట్టుకున్నాడు…