Description
Pustakalato Sneham Moodu Bangaru Nanalu (Level 3) పుస్తకాలతో స్నేహం మూడు బంగారు నాణాలు (L3, S 11-20)
పిల్లల్లో పఠనాశక్తిని, పుస్తకాల పట్ల ప్రేమని పెంపొందించటానికి ‘పుస్తకాలతో స్నేహం’ పేరుతో కథల పుస్తకాల సెట్స్ రూపొందించాం. ఐదు స్థాయిలలో (పది పుస్తకాల చొప్పున) 10 సెట్లు – అంటే మొత్తం వంద పుస్తకాలు ప్రచురించ తలపెట్టాం. ప్రతి సెట్ తో పఠన స్థాయి అంచలంచలుగా పెరుగుతుంది. ఈ ప్రయత్నంలో శాంతివనం, విజ్ఞాన ప్రచురణలు కూడా కలిసాయి. ఇప్పటి వరకు 11 సెట్లలో 95 పుస్తకాలు ప్రచురించాం.
మూడవ స్థాయిలో పది పుస్తకాల రెండవ సెట్ ఇది:
- మూడు బంగారు నాణాలు
- అల
- తేనెటీగల తుట్టె
- పుస్తకాల మహిళ
- ఇమ్మాన్యుయల్ కల
- సేనాధిపతి
- ఆన్ ఫ్రాంక్
- షిన్ మూడు చక్రాల సైకిల్
- సడాకో కాగితపు పక్షులు
- నస్రీన్ రహస్య పాఠశాల & మౌన సంగీతం
8, 9 పుస్తకాలకు అవినాశ్ దేశ్‌పాండే బొమ్మలు తిరిగి వెయ్యగా, మిగిలినవాటికి శ్రీకాంత్ వేశాడు.
ఒక్కొక్క పుస్తకం 16 పేజీలు. మొత్తం నలుపు – తెలుపు బొమ్మలతో, సాధారణ కవరు పేజీతో రూపొందిన పుస్తకాలు ఇవి.