Description
Pustakalato Sneham Tatagari Pencilu (Level 2) పుస్తకాలతో స్నేహం తాతగారి పెన్సిలు (L2, S11-20)
పిల్లల్లో పఠనాశక్తిని, పుస్తకాల పట్ల ప్రేమని పెంపొందించటానికి ‘పుస్తకాలతో స్నేహం’ పేరుతో కథల పుస్తకాల సెట్స్ రూపొందించాం. ఐదు స్థాయిలలో (పది పుస్తకాల చొప్పున) 10 సెట్లు – అంటే మొత్తం వంద పుస్తకాలు ప్రచురించ తలపెట్టాం. ప్రతి సెట్ తో పఠన స్థాయి అంచలంచలుగా పెరుగుతుంది. ఈ ప్రయత్నంలో శాంతివనం, విజ్ఞాన ప్రచురణలు కూడా కలిసాయి. ఇప్పటి వరకు 11 సెట్లలో 95 పుస్తకాలు ప్రచురించాం.
రెండవ స్థాయిలో పది పుస్తకాల రెండవ సెట్ ఇది (Level 2, S11-20):
- తాతగారి పెన్సిలు – మిషెల్ ఫోర్ మాన్
- చుక్క – పీటర్ హెచ్ రేనాల్డ్స్
- చీమలూ, పెన్నూ – ఇద్ రీస్ షా
- స్నేహితులు ఉన్నది అందుకే – ఫ్లోరెన్స్ పారీ హైడీ, సిల్వియా వర్త్ వాన్ క్లీఫ్
- మూడు ప్రశ్నలు – లెవ్ తొలస్తాయ్
- డప్పు – భారతీయ కథ
- పెద్ద తోడేలు, చిన్న తోడేలు – నాదిన్ బ్రున్-కాస్మె
- ఎడ్డీ, చిన్న గాలిపటం – మాక్సిన్ ట్రాటియర్
- తగరపు సిపాయి – జేన్ బ్రియర్లీ
- కొండను కదలించిన మింగ్ లొ
ఒక్కొక్క పుస్తకం 16 పేజీలు. మొత్తం నలుపు – తెలుపు బొమ్మలతో, సాధారణ కవరు పేజీతో రూపొందిన పుస్తకాలు ఇవి.
ఈ పుస్తకాలకి బొమ్మలను శ్రీకాంత్ తిరిగి వేశాడు.