Shareera Bhagaalu – Jaateyaalu శరీర భాగాలు – జాతీయాలు

45

Description

జాతీయానికి పలుకుబడి, నుడికారం, నానుడి అనే పర్యాయపదాలు వ్యవహారంలో ఉన్నాయి. జాతీయంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? రెండు పదాలు విడివిడిగా ఉన్నప్పుడు ఇచ్చే అర్థం కంటే అవి కలిసినప్పుడు ఇచ్చే విశిష్టార్థమే జాతీయం.

పదాలు, పదబంధాలకు ఉన్న సహజార్థం మరుగునపడి విలక్షణమైన అర్థంతో ప్రయోగింపబడుతుంద ఇక్కడ వాచ్యార్థం కన్నా లక్షణార్థం ముఖ్యమైనది.

ఉదాహరణకు, ‘కళ్ళు కాయలు కాచు’ అనే పదసమూహంలో మాటలు విడివిడిగా చూసినప్పుడు వాటి ఒక్కొక్క మాట ఇచ్చే అర్థం వేరు, కలిసినప్పుడు మాత్రం ‘చాలాసేపటి నుంచి ఎదురుచూడటం’ అనే అర్థం ఇస్తుంది.

వ్యవహర్తల దృక్పధాన్ని బట్టి, సంస్కృతిని బట్టి, సామాజిక నేపథ్యాన్ని బట్టి, భౌగోళిక, చారిత్రక, పురాణేచిహాసాల ఆధారంగా జాతీయాలు రూపొందుతూ ఉంటాయి. వీటన్నింటినీ పిల్లలు అవగాహన చేసుకునే ముందు వారికి ప్రాథమికంగా ఆసక్తి కలగడానికి శరీర అవయవాలతో ఏర్పడే జాతీయాలను ఈ పుస్తకం పరిచయం చేస్తుంది.

జి. ఎస్. చలం కూర్చిన ఈ పుస్తకానికి సమీ షేక్ బొమ్మలు వేశారు.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication