Description
Tenali Ramalingadu తెనాలి రామలింగడు
Genre: జానపద & హాస్య కథలు
వృద్ధుడు అయిన తన గురువు భుజాల మీద ఒక యువకుడు ఉండటం చూసిన రాజుకి ఏదో జరిగిందని అర్థం అయ్యింది. రామలింగడు ఉన్న చోట ఊహించనది ఏదో జరుగుతూనే ఉంటుందని అతను త్వరలోనే గ్రహించాడు. ఈ పల్లెటూరి బైతు ముర్ఖుడు ఏమీ కాదు. అతని తెలివి తేటలకు కాళీ దేవి కూడా సంబర పడిపోయింది. విజయనగర సామ్రాజ్య ఆస్థానంలో చోటు సంపాదించటమే కాదు, అనతి కాలంలోనే కృష్ణదేవ రాయలు గుండెలలో కూడా చోటు దక్కించుకున్నాడు రామలింగడు. రోజు అంతా ఒత్తిడి పనులలో గడిపే రాజుకి అతని హాస్యంతో మనసు తేలిక అయ్యేది.