Description
Velugu Ravvalu వెలుగు రవ్వలు
శాస్త్రజ్ఞులు అన్న పదం వింటే పుస్తకాలు, ఖరీదైన పరికరాలు, వింత పొగలు కక్కుతూ ఉండే పరీక్షనాళికలు, బీకర్లతో చుట్టూ ఉన్న ఒంటరి వ్యక్తి బొమ్మ కళ్లముందు కదలాడుతుంది. కానీ వాస్తవంలో శాస్త్రజ్ఞులు బహుముఖ ప్రజ్ఞ కలిగి ఉంటారు. ఈ పుస్తకంలోని కొంత మంది శాస్త్రజ్ఞులు కథలు, కవితలు రాశారు, కొంతమందికి కళలంటే మక్కువ. కొంతమందికి మోటర్‌సైకిళ్లమీద వేగంగా దూసుకెళ్లటం ఇష్టం!
అనేక మంది శాస్త్రజ్ఞుల తమ పరిశోదనశాలలకు పరిమితం కాకుండా ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా తీర్చిదిద్దటానికి కృషి చేశారు.
ఈ శాస్త్రజ్ఞుల జీవన చిత్రణతో పాటు వారి వ్యక్తిగత అంశాలను కూడా జోడించి వాళ్ల విలక్షణమైన వ్యక్తిత్వాలను చిత్రించే ప్రయత్నం జరిగింది. వాళ్లు విజ్ఞానశాస్త్రాన్ని చేపట్టనికి కారణం ఏమిటి? చిన్ననాటి అనుభవం ఏదైనా స్ఫూర్తిని ఇచ్చిందా? దానికి కారణం ప్రియమైన ఉపాధ్యాయులా లేదా అనురాగం పంచిన తల్లా? ఈ శాస్త్రజ్ఞులు, ప్రత్యేకించి మహిళా శాస్త్రజ్ఞులు ఎటువంటి సమస్యలను ఎదుర్కొన్నారు?
ఈ శాస్త్రజ్ఞుల జీవితాలు యువతలో స్ఫూర్తిని నింపుతాయేమో!
వెలుగు రవ్వలు గత కాలపు 40 స్ఫూర్తిదాయక భారతీయ శాస్త్రజ్ఞుల జీవితాలను, వాళ్ల కృషిని వివరిస్తుంది.
బొమ్మలు: కారన్ హెడేక్
మూడవ ముద్రణ: మే 2024