Description
Vinta Drusyam వింత దృశ్యం
ఈ కథలు చిన్నారుల కోసం. పెద్దవారికి కాదని కాదు. జంతువుల వింత చేష్టల కథలు కొన్ని. మనుషుల్లో మంచిచెడుల గురించి చెప్పినవి ఇంకొన్ని మరికొన్నేమో తెలివితేటలతో అపాయాల్ని తప్పించుకున్న, ఉపాయాలతో సమస్యలను వదిలించుకున్న వారి కథలు ఏ కథలోకెళ్ళినా ఓ విలువో, హాస్యమో, విశేషమో, చమత్కారమో దొరుకుతాయి. కనుక ఇవి చిన్నారి పాఠకులకి ఆసక్తి కలిగిస్తాయి. చదివిన వారందరికీ ఆనందం తథ్యం. అన్నట్లు, ఇవి శ్రీకృష్ణ వరప్రసాద్ రాసిన కథలు.
సొంత రచనలతో పాటు ఆంగ్లకథలను, జానపద గాథలను తెలుగులోకి మలచుకున్నవి కూడా. ఇంతకు ముందు యంగ్‌హీరో, బొమ్మరిల్లు, బాలచంద్రిక, బాలజ్యోతి, ఉదయం పత్రికల్లో ప్రచురితమైనవి.