Ateetam అతీతం

45.00

Description

ఇంటర్ చదువుతున్న కార్తీక్‌ ఒక రోజు కనపడకుండా వెళ్లిపోయాడు. అదే వీధిలో ఉండే అతీత్ తన స్నేహితుడు సుమంత్‌తో కలిసి కార్తీక్‌ డిజిటల్ ఫుట్‌ప్రింట్‌ని విశ్లేషించి అతడు నల్లమల అడవులలోకి వెళ్లాడన్న నిర్ధారణకు వస్తారు. క్యాప్టెన్ రుద్ర సహకారంతో కార్తీక్‌ని కాపాడి హైదరాబాదు తీసుకుని వస్తారు అతని తల్లిదండ్రులు, మిత్రులైన అతీత్, సుమంత్‌లు.

ఇంతకీ కార్తీక్ నల్లమల అడవులకు ఎందుకు వెళ్లాడు? అతనిని వేధిస్తున్న ప్రశ్నలు ఏమిటి? వాటికి సమాధానాలు కనుక్కోవడంలో అతీత్ ఎలా సహకరించాడు. తెలియని విషయాలను అతీత శక్తులని సరిపెట్టుకోకుండా సంతృప్తి చెందేవరకు కారణాలను అన్వేషించాలనే అతీత్ మనల్ని ఎక్కడికి తీసుకునివెళుతున్నాడో చూడండి.

ఈ పుస్తకానికి తుంబలి శివాజి బొమ్మలు వేశారు.

పిల్లలలో తెలుగు చదివే సామర్ధ్యాన్ని పెంచటానికి,  పుస్తకాల పట్ల ప్రేమ కలిగించటానికి రచయితల నుంచి 10 ఏళ్ల పైబడిన పిల్లల కోసం నవలలను తానా – మంచి పుస్తకం ఆహ్వానించాయి. వాటిల్లో 2021లో బహుమతికి ఎంపికైన నవలలో ఇది ఒకటి.