Description
అతను సాంప్రదాయ విద్యను తిరస్కరించి, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. అతని కవితలు వాడుక భాషలో ఉన్నాయని ఎగతాళి చేశారు కానీ అవే రెండు దేశాలకు జాతీయ గీతాలుగా మారాయి. అత్యున్నత నోబెల్ సాహిత్య బహుమతి, నైట్హుడ్ లభించేవరకు బెంగాలీ సమాజం అతనిని విమర్శిస్తూనే ఉంది! బహుముఖ ప్రజ్ఞాశాలియైన రవీంద్రనాథ్ ఠాగూర్ జీవితం ఎంత ఆసక్తికరమో అంతే స్ఫూర్తిదాయకం కూడా. అతను తన పుస్తకాల్లో, సంగీతంలో, ఆలోచనలను రేకెత్తించే అసాధారణ ఆదర్శాల్లో ఇప్పటికీ జీవించే ఉన్నాడు.




