Description
లోహం అలసిపోతుందా? మొక్కలు అనుభూతి చెందుతాయా? ఇవి అసాధారణమైన ప్రశ్నలు, కానీ జగదీశ్ చంద్ర బోస్ అంతకన్నా అసాధారణమైన ప్రజ్ఞావంతుడు. 1858లో పుట్టిన ఆయన చిన్నవయసులోనే తనదైన ఉత్సుకత, ధైర్యసాహసాలతో ప్రకృతి రహస్యాలను శోధిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. 1937లో కన్నుమూసేనాటికి ఆయన ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త అయ్యారు.. రేడియో తరంగాల గురించి పరిశోధించిన తొలి శాస్త్రవేత్తల్లో ఆయన ఒకరు. బయోఫిజిక్స్, మొక్కల మీద కాంతి, విద్యుత్ తరంగాల ప్రభావాన్ని అధ్యయనం చేసిన తొలి శాస్త్రవేత్త. తన ఆవిష్కరణలను పేటెంట్ చేయడానికి ఇష్టపడని జగదీశ్… విజ్ఞానం అందరికీ అందుబాటులో ఉండాలని అనేవారు.




